chitika

Tuesday 16 December 2014

HUMOR FROM REAL LIFE

నమస్కారం.  నవ్వుల బ్లాగ్ కి స్వాగతం.

మన జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుభవాల్లోకూడా చాలా హాస్యం వుంటుంది.  నేను ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకతను అరటిపళ్ళు అమ్ముతున్నాడు.  "అమృతపాణి" అని అరటిపళ్ళలో ఓక రకం.  అమృతంలాంటి పళ్ళు అని అర్ధం.  అతని అమ్మడం ఎలగుంటుందంటే ఇవి తింటే చనిపోతారు అనే అర్ధం వస్తుంది చూడండి.
అతను అమ్ముతున్నాడు. "అమృతపాణీ, అమృతపాణీ, అ.." ఎవరో పిలిచినట్టనిపిస్తే అటు చూసి, "ఆ మృతపాణీ, ఆ మృతపాణీ, ఆ  మృతపాణీ" ఇలా అమ్ముతూపోతాడు.   అమృతపాణల్లా మృతపాణయిపోయింది మరి.
******************************************************

ఇలాంటిదే మరోటి.

రైల్లోనే పాటలుపాడే వాళ్ళు.  అందరూ కాపోయినా కొందరు మాత్రం బండబూతులు చాలా కాంఫిడెన్సుగా పాడేస్తారు.  వాల్లకాంఫిడెన్సు చూస్తే వాళ్ళ పాడిందే కరెక్టేమో అన్న డౌటుకూడా వస్తుంది మనకు.  అదెలా వుంటుందో చూడండి.
"చంకరా నాద చరీరాపరా జీవేస్వరా" మరి ఈ పాటవింటే బాలసుబ్రమణ్యానికి మాత్రం షాక్ కొట్టకుండా వుంటుందా చెప్పండి.
******************************************************

మీకు చిలకజోస్యం తెలుసు మరి కాకి జోస్యం తెలుసా?  తెలీదుకదూ? అయితే ఇది చదవండి మరి.
అప్పుడే పరీక్షరాసొచ్చిన వెంకట్  పార్కులో ఒక చెట్టు కింద కూర్చుని పరీక్షపేపర్ చూస్తూ "నేను పరీక్ష పాస్ అవుతానా? కానా" అని అనుకుంటుంన్నాడు.
చెట్టుమీద కాకి "కావు కావు" అంది.
******************************************************

తనకు వైద్యం చేయటంవచ్చినా తన క్లినిక్కి పేషంట్స్ ఎందుకు రావట్లేదో అర్ధంకాక ఒక జోతిష్యున్ని పిలిపించాడు ఆ డాక్టరుగారు తన క్లినిక్కి.  ఆప్పుడా జోతిష్యుడు, "మీ పేరూ,ఆ బోర్డూ కారణం" అన్నాడు.
"ఎలా" అడిగారు డాక్టరుగారు.
"ఓసారి ఆ బోర్డు చూడండి" అన్నాడు జోతిష్యుడు.
ఆ బోర్డు ఇలా వుంది.
"డాక్టర్ వైకుంఠం, పైకి దారి."
ఇక ఆ డాక్టరుగారి పరిస్థితి వేరే చెప్పాలా?
******************************************************
ఇక కొన్ని పలకరింపులు చూద్దాం.

మనము మామూలుగా పలకరించినా  ఒకోసారి అవతలవారికి చురుక్కుమంటుంది.  అదెలాగంటే, యాక్సిడెంటయి హాస్పిటల్ లో వున్న పేషంట్ని చూడ్డానికి వెళ్ళి, "ఎలావున్నారు?" అని ఆడగటం.  సదరు పేషంట్ ఏమని సమాధానం చెప్పాలి? బావున్నాను అంటే యాక్సిడెంటయి హాస్పిటల్లో వుండటం బావుంది అన్న అర్ధం వస్తుందాయె.  ఏం సమాధానం చెప్పాలో తెలీని పరిస్థితి ఇది.

******************************************************
ఇప్పుడు  ఒక జోక్.

ఒక స్టూడేంట్ తన తండ్రితో అంటున్నాడు.

"నాన్నా! జీవితంలో ఒక్కోసారి మనము అనుకోనివి జరుగితూంటాయి.  అలాంటప్పుడే ధైర్యంగా వుండాలి అంతేకానీ ఎదుటివాళ్ళని తిట్టటంకానీ కొట్టంటంకానీ చేయకూడదు...."
"వెధవా! మళ్ళీ పరీక్ష ఫెయిల్ అయ్యావా?" కోపంగా అరిచాడా తండ్రి.
******************************************************
ఓ భార్యా బాధితుడి బాధ చూడండి.
"అదేంటోయ్ మొన్ననే కదా మీ ఆవిడకి పుట్టినరోజని చీర కొన్నావు, మరి ఇవాళ ఈ చీరెవరికి?" ఆశ్చర్యంగా అడిగాడు రమేష్ సురేష్ ని.
"ఈరోజు నా పుట్టినరోజులే" నీర్సంగా అన్నాడు సురేష్.డు
******************************************************
ఇంకొంతమంది భార్యా బాధితుల గోడు చదవండి.
"నాకు నా భార్యమీద కోపంస్తే నేను ఆ రోజు భోజనం చేయను."అన్నాడు వెంకట్.
"నేను రివర్సు. వండిందంతా నేనే తినేస్తా దానికేం మిగల్చకుండా" అన్నాడు సురేష్.
"మరి నువ్వు?" అడిగారు ఇద్దరూ రవిని.
"నేను మీలా కాదు, నేనైతే ఆరోజు వంటే చేయను." గొప్పగా చెప్పాడు రవి.
అందుకే అన్నారు "ఇడీ అమీనూ, సద్దాం హుస్సేన్, హిట్లర్ ఎట్సెట్రా, ఈంట్లోవున్న పెళ్ళాంకన్నా పెద్ద డిక్టేటర్లట్రా" అని.
******************************************************
"భార్యంటే ఎవరనుకున్నావురా? ఎక్కడో ప్పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి ఆన్న బధంతో మన జీవితంలో ప్రవేశించి మనకు చిన్నదెబ్బ తగిలినా విలవిల్లాడి పోయేదేరా భార్యంటే" ఇది పెదరాయుడు సినిమాలో డైలాగ్.

దీనికి పేరడీ చదవండి మరి.

"భార్యంటే ఎవరనుకున్నావురా? ఎక్కడో ప్పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి ఆన్న బధంతో మన జీవితంలో ప్రవేశించి మనల్ని కొట్టకుండా, గిల్లకుండా ఏడిపించేదేరా భార్యంటే."
******************************************************

No comments:

Post a Comment